ప్రభుత్వం ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ లతో టచ్ లో ఉందని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ టీకాలను స్థానికంగా తయారు చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బగాచీ భారత్ లో స్పుత్నీక్ టీకాను వేగవంతంగా ప్రవేశపెట్టానికి సాయం చేశాం. స్థానికంగా తయారు చేసే అంశంపై ఫైజర్, మోడెర్నాలతో చర్చలు జరుపుతున్నాం అని అన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయిలో సామర్థ్యాలను పెంచే ప్రయత్నాలు చేయలని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వి ష్రింగ్లా అన్నారు.