కరోనా వైరస్ పోరాటంలో ముందుండి పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రత్యేక నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. సెకండరీ గ్రేడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్ స్పెక్టర్ల స్థాయి అధికారుల వరకు అందరికీ రూ. 5 వేలు చొప్పున కొవిడ్ ఇన్సెంటివ్ కింద ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో సేవలందిస్తోన్న 1,17,184 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.