
భారత్- ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైన నేపథ్యంలో ఐసీసీ కి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా లేఖ రాసింది. ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీ జోక్యం చేసుకోవాలని కోరింది. కరోనా కారణంగా మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటిస్తే అందుకు తగినట్లు తాము ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని చెప్పింది. ఈ మ్యాచ్ రద్దుతో తమకు 4 కోట్ల పౌండ్లు నష్టం వాటిల్లినట్లు ఈసీబీ లేఖలో పేర్కొంది.