Earthquake Prakasam District: ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూ ప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. గత నెల 6న కూడా ప్రకాశం జిల్లా పొదిలిలో భూకంపం వచ్చింది. ఉదయం 9,54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.