
తుగ్గక్ పాలనలో భౌతిక దాడులు దుర్మార్గమని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమన్నారు. రాక్షసులను మించిన రాక్షసులుగా వైసీపీ మూక తయారైందని ఆగ్రమం వ్యక్తం చేశారు. ప్రతి దాడికీ ప్రతీకార దాడి తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా సీఎం జగన్ పాలన ఉందన్నారు.