పవన్ కోసం హరీష్ పోరాటాల హంగులు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కథలు బాగా సెట్ అవుతాయి. ముఖ్యంగా సమాజం పై పోరాడే వీరుని పాత్ర పవన్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. వకీల్ సాబ్ లో కేవలం లాయర్ గా కనిపిస్తేనే ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ సినిమాలో మహా అయితే పవన్ నాలుగైదు పవర్ ఫుల్ డైలాగులు పలికి ఉంటాడు. ఆ మాత్రానికే ఆ సినిమా పై అభిమానులు కలెక్షన్స్ సునామీ కురిపించారు. ఇవ్వన్నీ గమనించాడు కాబట్టే.. ప్రస్తుతం దర్శకుడు హరీష్ […]

Written By: admin, Updated On : July 5, 2021 4:36 pm
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కథలు బాగా సెట్ అవుతాయి. ముఖ్యంగా సమాజం పై పోరాడే వీరుని పాత్ర పవన్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. వకీల్ సాబ్ లో కేవలం లాయర్ గా కనిపిస్తేనే ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ సినిమాలో మహా అయితే పవన్ నాలుగైదు పవర్ ఫుల్ డైలాగులు పలికి ఉంటాడు. ఆ మాత్రానికే ఆ సినిమా పై అభిమానులు కలెక్షన్స్ సునామీ కురిపించారు.

ఇవ్వన్నీ గమనించాడు కాబట్టే.. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్, పవన్ తో చేయబోతున్న సినిమాలో సమాజ సేవకు సంబంధించిన అదనపు హంగులు అన్నీ తన కథకి అద్దేసే పనిలో పడ్డాడు. వకీల్ సాబ్ కు ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసినట్టుగానే.. తన సినిమాలో కూడా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ను రాసాడు హరీష్ శంకర్.

ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ రైతుబిడ్డగా రైతు నాయకుడిగా కనిపిస్తాడట. ఇక రైతు నాయకుడు అంటే.. అందరికీ మ్యాటర్ అర్థమైయే ఉంటుంది, వ్యవసాయంలో నష్టపోయి జీవితాలను నష్టపోతున్న వారికీ పవన్ తన శైలిలో సాయం అందిస్తాడు. అలాగే ఆపదలో వున్నవారిని ఆదుకుంటాడు. అయితే సీన్స్ వెరీ రెగ్యులర్ గా ఉన్న, సీన్స్ ను తెరెకెక్కించే విధానం మాత్రం హరీష్ చాల కొత్తగా ప్లాన్ చేశాడట.

మొత్తానికి హరీష్ శంకర్ ఇలా అన్ని హీరోయిజం ఎలిమెంట్స్ ను తన స్క్రిప్ట్ లో యాడ్ చేసుకుని.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తీయాలని గట్టిగా ప్లాన్ చేశాడు. ఇక హరీష్ శంకర్ అంటేనే బోల్డ్. గ్లామరస్ హీరోయిన్, అలాగే డ్యూయట్ సాంగ్స్, రొమాన్స్ లాంటి అంశాలు పుష్కలంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాడు.

మరి హరీష్ ఈ సినిమాతో పవన్ పూర్వ మాస్ వైభవాన్ని తెలుగు తెరకు మరోసారి ఘనంగా చాటి చెప్పడం ఖాయం. మొత్తానికి చూస్తుంటే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో కాస్త గట్టిగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.