
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షీంచగా 3,660 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా 23 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,060 కి పెరిగింది. ఇవాళ 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్ ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.