https://oktelugu.com/

Relationship : అమ్మాయిలు మీ వెనుక పడాలన్నా? మీతో రిలేషన్ బ్రేక్ చేయవద్దన్నా ఈ పనులు చేయండి చాలు..

చాక్లెట్స్ ఇవ్వడం, బేకరీల్లో పఫ్స్ తినిపించడం వంటి వాటికంటే ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల్లో వారి బిహేవియర్‌ని ఇష్టపడతారట. అందులో ముఖ్యంగా కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్న వ్యక్తులని చూసి త్వరగా దగ్గరవుతారు. మరి అమ్మాయిలను ఆకర్షించే ఆ గుణాలు ఏంటి? ఎలా ఆకర్షించాలి. వారికి ఎలా ఉంటే ఇష్టమో ఓ సారి తెలుసుకోండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 02:14 AM IST

    Relationship

    Follow us on

    Relationship : నచ్చిన అమ్మాయి మనసు గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారా? అయినా వర్కౌట్ కావడం లేదా? ఇక కొందరు అయితే అమ్మాయిలకు నచ్చే కలర్ డ్రెస్ వేయడం, ఇష్టమైన చాక్లెట్స్ గిఫ్ట్‌గా ఇవ్వడంఇలా చాలా చేస్తుంటారు. అయితే చాక్లెట్స్ ఇవ్వడం, బేకరీల్లో పఫ్స్ తినిపించడం వంటి వాటికంటే ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల్లో వారి బిహేవియర్‌ని ఇష్టపడతారట. అందులో ముఖ్యంగా కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్న వ్యక్తులని చూసి త్వరగా దగ్గరవుతారు. మరి అమ్మాయిలను ఆకర్షించే ఆ గుణాలు ఏంటి? ఎలా ఆకర్షించాలి. వారికి ఎలా ఉంటే ఇష్టమో ఓ సారి తెలుసుకోండి.

    అబ్బాయిలు డబ్బులు సంపాదించిన లేకపోయినా పెద్దగా దాని గురించి ఆలోచించరట అమ్మాయిలు. కానీ, ఎమోషనల్‌గా కనెక్ట్ అవలేదంటే మాత్రం మీతో డిస్‌కనెక్ట్ అవడం పక్కా అంటున్నారు నిపుణులు. వారు బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి. వారికి బాధ కలిగినప్పుడు మీ దగ్గర ఓపెన్ గా చెప్పుకునే ఫ్రీడం ఉండటం వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలు. మీరు కూడా అదే విధంగా వారి వద్ద ఓపెన్ గా ఉండాలి. అలా కాకుండా ప్రతీది దాస్తుంటే మాత్రం మీరంటే వారికి నచ్చదు.

    అబ్బాయిలు మెచ్యూర్‌గా ఉండాలి. ఇలాంటి వారంటే అమ్మాయిలకి భలే ఇష్టం. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంతేకాదు సమయానుకులంగా పెద్దవారిలా బిహేవ్ చేయాలి. ఇలాంటి వారంటే ఎక్కడలేని అభిమానం. మీరిద్దరు కలిసినప్పుడు నాటీగా ఉంటే ఒకే కానీ, సమయం వచ్చినప్పుడు మాత్రం మెచ్యూర్డ్‌గా ఉండాల్సిందే. అలా పరిస్థితులని హ్యాండిల్ చేసేవారికే ఎక్కువగా ఫ్రిఫరెన్స్ ఇస్తారు అమ్మాయిలు.

    కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మరీ ముఖ్యంగా అబ్బాయిల్లో ఈ కాన్ఫిడెన్స్‌ అంటేనే అమ్మాయిలకు ఎక్కువ ఇష్టం. ప్రతి విషయానికి భయపడడం, చేయలేకపోతామేమో అని వెనకడుగు వేసే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు ఇష్టం ఉండదు. నేను చేయగలను నా వల్ల అవుతుంది అనే పాజిటివ్ ఆలోచనతో ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా దెబ్బ పడుతుంది జాగ్రత్త. ఇలాంటి అబ్బాయిలు కచ్చితంగా అమ్మాయిల మనసు గెలుచుకుంటారు. పెళ్ళి చేసుకునే అమ్మాయిలు తనకి కాబోయే భర్తలో ఈ లక్షణాలు ఉండాలనే ఎక్కువ కోరుకుంటారు.

    ఏదైనా పని మొదలుపెడితే దానిని కాన్ఫిడెన్స్‌తో చేయాలి. పని విషయంలోనే కాదు రిలేషన్‌లోనూ అంతే ఏకాగ్రత నమ్మకం ఉండాలి. ఇలా ఉంటే అమ్మాయిలు మీకు ఫిదా అవుతారు. మీ రిలేషన్ కు పక్కా వాల్యూ ఇస్తారు. మరో విషయం ఏంటంటే కోరుకునే అబ్బాయి నమ్మకంగా ఉండడం చాలా అవసరం. అందుకే జెన్యూన్‌గా ఏ విషయాన్నైనా చెప్పే అబ్బాయిలకే అమ్మాయిలు మనసిస్తారు. వారు కోరుకునే రిలేషన్‌లో జెన్యూన్‌నెస్ లేకపోతే మాత్రం ఆ రిలేషన్ చాలా రోజుల ఉండటం కష్టమే. కానీ పైన తెలిపిన లక్షణాలు మీలో ఉంటే మాత్రం అమ్మాయిలు మీ వెనక పడటం గ్యారంటీ అంటున్నారు నిపుణులు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..