https://oktelugu.com/

Tree : ఇంటి ముందు ఈ చెట్లను ఎట్టిపరిస్థితుల్లో పెంచొద్దు. చాలా ప్రమాదం..

చాలా మంది అనేక రకాల చెట్లని పెంచుకుంటారు. కానీ ఈ విషయంలో కొన్ని తప్పులు మాత్రం చేయవద్దు. వీటిలో కొన్ని అందరి ఇళ్ళలో ఉన్నప్పటికీ వాటి వల్ల నష్టాలే అంటున్నారు నిపుణులు. మరి ఆ చెట్లు ఏంటి? ఎందుకు ఉండకూడదు అనే వివరాలు

Written By:
  • Srinivas
  • , Updated On : November 11, 2024 / 04:10 AM IST

    planting Tree

    Follow us on

    Tree :  ఇంటి ముందు చెట్లు, మొక్కలు ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. ఇంటి ముందే పార్క్ ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి. చాలా అందంగా కనిపిస్తుంది. ఓ కప్పు టీ తీసుకొని అలా స్విప్ చేస్తుంటే భలే అనిపిస్తుంది కదా. అందుకే, చాలా మంది అనేక రకాల చెట్లని పెంచుకుంటారు. కానీ ఈ విషయంలో కొన్ని తప్పులు మాత్రం చేయవద్దు. వీటిలో కొన్ని అందరి ఇళ్ళలో ఉన్నప్పటికీ వాటి వల్ల నష్టాలే అంటున్నారు నిపుణులు. మరి ఆ చెట్లు ఏంటి? ఎందుకు ఉండకూడదు అనే వివరాలు తెలుసుకుందాం.

    గన్నేరు: ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవద్దు. దీని వల్ల చెడు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ చెట్టుకి పూచే పూలు అందంగా ఉంటాయి. అందుకే అందం కోసం ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటారు. ఈ పూలు పూజలో ఉపయోగపడతాయి. కానీ ఈ చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి మంచివి కావని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

    కాక్టస్: ఈ చెట్టు చూడ్డానికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఓ మూలకు పెడితే కాస్త అందంగా అనిపిస్తుంది. కొందరికి ఈ ముళ్ళ చెట్టు నచ్చదు. కానీ మరికొందరు మాత్రం ఇష్టంగా తెచ్చుకుంటారు. అయితే, చూడ్డానికి కాస్తా డిఫరెంట్‌గా కనిపించే ఈ చెట్టుని ఇంట్లో పెంచవద్దు అంటున్నారు నిపుణులు. దీని వల్ల కూడా నష్టాలు ఉంటాయట. సో స్కిప్.

    పీస్ లిల్లీ చూడటానికి బాగుంటుంది. వీటికి పూచే పూలు అందంగా, తెల్లగా ఉంటాయి. అయితే, దీనిని ఇంట్లో పెంచడం మంచిది కాదు. ఈ చెట్ల కారణంగా స్కిన్, మౌత్ ఇరిటేషన్ కు గురి అవుతుంటాయి. వీటి నుంచి వచ్చే గాలి కూడా మంచిది కాదు. దీన్ని పీలిస్తేల బ్రీథింగ్ సమస్యలు, మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకే, ఈ చెట్లను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

    అలోవెరా..అందరి ఇల్లల్లో ఉండే ఈ చెట్టు అందంలో, ఆరోగ్యంలో కూడా మంచి పాత్ర పోషిస్తుంది. దీని వల్ల కలిగే లాభాలతో దీనిని ఇంట్లోనే పెంచుకుంటారు. దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ, ఈ చెట్లు పెంపుడు జంతువులకు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. పెంపుడు జంతువులకు అనేక సమస్యలు వస్తాయి. ఈ చెట్టు వల్ల కుక్కుల డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. సో స్కిప్.

    పత్తి: కొంతమంది ఇంట్లో పత్తి మొక్కను కూడాపెంచుతారు. ఈ మొక్క అందంగా కనిపించినా మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇంటి తోటల్లో పత్తి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, మతపరంగా, ఇంట్లో పత్తి మొక్కను నాటవద్దు అంటున్నారు నిపుణులు. పత్తి మొక్క నాటితే ఆర్థిక సంక్షోభం ఉంటుందట. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది అంటున్నారు పండితులు.

    జిల్లేడు: తెల్లని పువ్వులతో ఉన్న జిల్లేడు కూడా చూడటానికి చాలా అందంగా, పీస్ ఫుల్ గా కనిపిస్తుంటుంది. ఈ మొక్క పువ్వులను శివారాధనలో ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. కానీ ఈ మొక్కను ఇంట్లో నాటవద్దు. దీని నుంచి ప్రతికూల శక్తి వస్తుంది. అది కుటుంబానికి హానికరం. వాస్తవానికి, జిల్లేడు నుంచి ఓ ద్రవ పదార్థం వస్తుంటుంది. దీని వల్లనే చాలా నష్టాలు ఉంటాయి. ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువనట.