Rivers : ప్రపంచంలో పొడవైన, అందమైన నదులు ఇవే..

దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నది మీకు తెలుసా? ఇదే ప్రపంచంలో అతిపెద్ద నది. ఈ నది సెకనుకు 224 వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుందని సమాచారం. సౌత్‌ అమెరికా ఖండంలో ఉన్న ఈ అమెజాన్‌ నది ఎంతో మందిని ఆకట్టుకుంటుంది కూడా. ఇది చాలా అందమైన నది. ప్రకృతి చాలా బాగుంటుంది.

Written By: NARESH, Updated On : November 10, 2024 1:43 pm

Rivers

Follow us on

Rivers :  నదులు ఒక ప్రకృతి వరం. ఎంతో అందమైన ఈ నదులు మనసుకు హాయిని అందిస్తాయి. నదులు లేకపోతే వ్యవసాయంతో పాటు ఎన్నో పనులు జరగడం కష్టంగా మారేది. ఈ ప్రకృతి వరం వల్ల ఎలాంటి సమస్య లేకుండా ఎన్నో పనులు జరుగుతున్నాయి. అయితే మన ప్రపంచంలో అందమైన, పొడవైన నదులు ఏవి, ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవాలి అని ఉందా? అయితే ఆలస్యం ఎందుకు చూసేయండి.

దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నది మీకు తెలుసా? ఇదే ప్రపంచంలో అతిపెద్ద నది. ఈ నది సెకనుకు 224 వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుందని సమాచారం. సౌత్‌ అమెరికా ఖండంలో ఉన్న ఈ అమెజాన్‌ నది ఎంతో మందిని ఆకట్టుకుంటుంది కూడా. ఇది చాలా అందమైన నది. ప్రకృతి చాలా బాగుంటుంది. అడవుల గుండా ప్రవహించే ఈ నది అందాలు వర్ణించడం కష్టమే. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ప్రవహిస్తుంటుంది. అయితే చివరికి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఈ అమెజాన్ నది. ఈ నదిలో ఎన్నో భయంకర జీవులు నివసిస్తున్నాయట.

బంగ్లాదేశ్, ఇండియా, టిబెట్ లలో ప్రవహించే బ్రహ్మపుత్ర, మేఘన గంగాలు మూడు నదులు. ఇవి మూడు కలిసి ఓ పెద్ద ప్రవాహంగా మారతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా కూడా ఇదే. ఈ నదులు బంగాళాఖాతంలో సెకనుకు 43,950 క్యూబిక్ మీటర్ల నీటిని వదులుతుంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇక ఆఫ్రికాలోని కాంగో నదికి మరో పేరు జాయ్ రే. సెకనుకు 41,400 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలో కలుపుతుంది. కాంగో నది అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది.

చైనాలోని అతి పెద్ద నది యంగ్త్ జే నది. తూర్పు చైనా సముద్రంలో కలిస్తుంది. ఈ నది సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీరు ను కలుపుతుంది. అంతేకాదు 6,300 కిమీ ప్రవహిస్తుంది. ఓరినికో నదిదక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ఉంది. కొలంహబియాలో ప్రవహించే ఓరినికో నది పొడవు దాదాపుగా 2,250 కిలోమీటర్లు ఉంటుంది అని సమాచారం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీరుతో ప్రవహిస్తుంటుంది. ఇది రెండో అతి పొడవైన నదిగా పేరు కాంచింది.

ఆఫ్రికా ఖండంలో ఉన్న నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నదులలో ఒకటి. దీని చుట్టూ ఘన చరిత్ర ఉంది. చాలా అందమైన నది కూడా. ఇండియాలో అతిపెద్ద నదిగా పేరు గాంచింది గంగానది. ఇండియన్స్‌ అత్యంత పవిత్రంగా భావించే నది కూడా. ఈ నది ఒడ్డున అనేక హిందూ దేవాలయాలు ఉంటాయి. ముర్రే రివర్‌ ఆస్ట్రేలియా ఖండంలోని అందమైన పొడవైన నదులలో ఒకటి. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నది కూడా ఈ నది.

 

అమెరికా ఖండంలో ఉన్న కొలెరెడో నది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. దీంతో ఈ నది అత్యంత ఆకర్షణీయమైన లొకేషన్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక చైనాలో ఉన్న లిజియాంజ్‌ నది ఆకర్షణీయమైన లొకేషన్లతో నిండి ఉంది. ఈ నది పచ్చటి ప్రకృతితో మంచి ఆహ్లాదాన్ని పంచుతుంది.