https://oktelugu.com/

Norway : రాత్రి లేని దేశం, ఒక్కరి ప్రయాణం కూడా నిషేధం.. నమ్మలేని నిజాలు..

భూమ్మీద చివరి దేశం ఏంటో ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకు దీనికి గుర్తింపు వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నారా? అయితే డోన్ట్ వర్రీ ఈ విషయాలతో పాటు ఆ దేశ అద్భుతమైన మిస్టరీ గురించి కూడా తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : November 10, 2024 1:24 pm

Norway

Follow us on

Norway : భూమి గుండ్రంగా ఉంటుందని చదువుకున్నారా లేదా. జస్ట్ ఫర్ ఫన్నీ బాస్. అందరికీ తెలిసిందే కదా. అయితే మన ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం దాని సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది. కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందాయి. కానీ మరికొన్ని వాటి సహజ దృశ్యాలతో ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద, ధనిక దేశాల గురించి ఇప్పటికీ మీరు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. అయితే భూమ్మీద చివరి దేశం ఏంటో ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకు దీనికి గుర్తింపు వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నారా? అయితే డోన్ట్ వర్రీ ఈ విషయాలతో పాటు ఆ దేశ అద్భుతమైన మిస్టరీ గురించి కూడా తెలుసుకుందాం.

ఈ సమస్త విశ్వంలోని చివరి దేశం నార్వే. ఇది చాలా అందమైన దేశం కూడా. అయితే ఇక్కడ రాత్రి ఉండదండోయ్. ఉత్తర నార్వేలోని హామర్‌ఫెస్ట్ నగరంలో, సూర్యుడు 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు అంటే నమ్ముతారా?. నిజమేనండి బాబు. అందుకే ఈ దేశానికి అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అనే పేరు వచ్చింది. ఇక్కడ 40 నిమిషాలు మాత్రమే చీకటిగా ఉంటుంది. మిగిలిన సమయం మొత్తం పగలే ఉంటుంది.

కేవలం 23 గంటల పగలు మాత్రమే కాదు.. ఇక్కడ వేసవిలో మంచు కురుస్తుంది. ఈ దేశంలో చాలా చల్లని వాతావరణాన్ని చూడవచ్చు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వేసవిలో ఉష్ణోగ్రత 45 నుంచి 50 డిగ్రీల వరకు ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం వేసవిలో మంచు కురుస్తుందట. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలుగా నమోదు అవుతుంది. చలికాలంలో, ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు ఒక అందమైన, అద్భుతాన్ని తిలకిస్తుంటాయి.

అసలు వేసవి కాలంలో రాత్రే ఉండదు. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇతర దేశాల మాదిరిగా ప్రతిరోజూ పగలు లేదా రాత్రి ఉండదట. ఆరు నెలలు రాత్రి ఉంటుంది. మిగిలిన ఆరు నెలలు పగలు ఉంటుంది. చలికాలంలో ఇక్కడ సూర్యుడు కనిపించడు. అంతేకాదు వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇలాంటి ప్రత్యేకతల కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఈ దేశాన్ని చూడాలి అనుకుంటున్నారు.

కానీ ఈ దేశానికి ఒంటరిగా వెళ్లడం నిషేధించారు. E-69 హైవే భూమి చివరలను నార్వేతో కలుపుతుంది. ఈ రహదారి ప్రపంచంలోని చివరి రహదారిగా ఉంది. ఇక్కడికి వెళ్తే ఆ తర్వాత మీకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. ఇక్కడే ప్రపంచం చివరిదిగా ఉంటుందట. అంతేకాదు ఈ హైవేలో ఒంటరిగా ప్రయాణించడం కూడా నిషేధమే. కేవలం ఒక పెద్ద సమూహం మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఒంటరిగా వెళ్లడం, వాహనాలు ఒంటరిగా తీసుకొని వెల్లడం కూడా నిషేధమే. ఈ ప్రాంతంలో ప్రతిచోటా మంచు ఉంటుంది. సో దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒంటరి ప్రయాణాలు నిషేధం.

సూర్యాస్తమయం, అరోరా బొరియాలిస్ అంటే ధ్రువకాంతి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు మీకు సరికొత్త అనుభూతి వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చేపల వ్యాపారం చేసేవారట. కానీ ఇప్పుడు దేశం అభివృద్ధి చెందింది కాబట్టి పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. ఆ ప్రాంతాల్లో పర్యాటకుల బస కోసం హోటళ్లు, రెస్టారెంట్ల వసతిని కల్పిస్తున్నారు.