గర్భిణీలకు 2డీజీ ఔషధం ఇవ్వొద్దు

కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్ డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని ఎలా వినియోగించాలో చెబుతూ నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా ఔషధ సరఫరా కోసం రోగులు, వైద్య సిబ్బంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ను సంప్రదించొచ్చని వెల్లడించింది. కొవిడ్ చికిత్స లో 2-డీజీ […]

Written By: Suresh, Updated On : June 1, 2021 3:23 pm
Follow us on

కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్ డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని ఎలా వినియోగించాలో చెబుతూ నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా ఔషధ సరఫరా కోసం రోగులు, వైద్య సిబ్బంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ను సంప్రదించొచ్చని వెల్లడించింది. కొవిడ్ చికిత్స లో 2-డీజీ ఔషధ వినియోగానికి ఇటీవల అత్యవసర అనుమతులు లభించిన విషయం తెలిసిందే.