మోడీతో ఫైట్:విజయన్ లేఖకు జగన్ స్పందనేంటి

అడకత్తెరలో ఇరుక్కున్న పోకచెక్కలా అయిపోయింది సీఎం జగన్ పరిస్థితి. మింగమంటే కప్పకు కోపం.. వద్దంటే పాముకు కోపం అన్నట్లుగా తయారయింది. గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ పీఎం నరేంద్ర మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేయడంతో తక్షణమే స్పందించిన జగన్ సోరేన్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. జగన్ స్పందనపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన విమర్శలపై స్పందించేందుకు ఈయనకెందుకు అంత తొందర అని ప్రజలు చర్చించుకున్నారు. కరోనా కట్టడి కోసం కేరళ సీఎం […]

Written By: Srinivas, Updated On : June 1, 2021 4:24 pm
Follow us on

అడకత్తెరలో ఇరుక్కున్న పోకచెక్కలా అయిపోయింది సీఎం జగన్ పరిస్థితి. మింగమంటే కప్పకు కోపం.. వద్దంటే పాముకు కోపం అన్నట్లుగా తయారయింది. గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ పీఎం నరేంద్ర మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేయడంతో తక్షణమే స్పందించిన జగన్ సోరేన్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. జగన్ స్పందనపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన విమర్శలపై స్పందించేందుకు ఈయనకెందుకు అంత తొందర అని ప్రజలు చర్చించుకున్నారు.

కరోనా కట్టడి కోసం కేరళ సీఎం పినరయ్ విజయన్ 11 రాష్ర్టాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మోదీ చర్యలపై తిరుగుబాటుకు కలిసి రావాలని కోరారు. అందరితోపాటు జగన్ కు సైతం లేఖ పంపారు. ట్వీట్ కూడా చేశారు. దీంతో జగన్ సమాధానంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమని స్పందిస్తారో అని ఉత్కంఠ గా చూస్తున్నారు. మోదీని విమర్శిస్తూ కేరళ సీఎం విజయన్ జగన్ కు లేఖ సైతం పంపారు.

విజయన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తే, ట్వీట్ చేస్తే బీజేపీకి కోపం వస్తుంది. సమాధానం ఇవ్వకపోతే ప్రజలకు అనుమానం వస్తుంది. మొత్తానికి జగన్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జగన్ సోరేన్ విషయంలో స్పందించినట్లుగా విజయన్ విషయంలో కూడా ఇప్పుడు తన అభిప్రాయం చెప్పాల్సి రావడంతో గొప్ప చిక్కుల్లో పడినట్లయింది.

సీఎం జగన్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంపై నోరు పారేసుకుంటే వచ్చే పరిణామాలపై జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయన్ లేఖకు ఎలాంటి సమాధానం ఇస్తారోనని పార్టీ నాయకులు సైతం ఉత్కంఠగా ఉన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై అందరు ముఖ్యమంత్రులు స్పందించే సమయం ఆసన్నమైంది