
జగన్ అక్రమాస్తుల కేసుల్లోని పెన్నా ఛార్జిషీట్ నుంచి గనులశాఖ విశ్రాంత సంచాలకుడు వీడీ రాజగోపాల్ పేరును తొలగించవద్దని కోర్టును సీబీఐ కోరింది. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం. శామ్యూల్, పీఆర్ ఎనర్జీ సంస్థ డిశ్చార్జీ పిటిషన్లుపై కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది.