– నూతన కార్యవర్గం ఎన్నిక.. కీలక తీర్మానాలు
Desk Journalists Association డెస్క్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘డెస్క్ జర్నలిస్టుల సంఘం’ (DJS) తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన డీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఐక్యతే మన బలం: బాదిని ఉపేందర్
ఈ సందర్భంగా డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బాదిని ఉపేందర్ మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టుల ప్రస్తావన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట రావడం, మన సంఘం సాధించిన ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి డీజేఎస్ విజ్ఞప్తులు
ప్రింట్, ఎలక్ట్రానిక్ , వెబ్ మీడియాలో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టుల కోసం డీజేఎస్ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.
* అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను పెంచాలి.
* జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలి.
* మొత్తం అక్రెడిటేషన్లలో మహిళలకు 33 శాతం కోటా కేటాయించాలి.
ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఒకవేళ అనుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణను మరింత తీవ్రతరం చేస్తామని ఉపేందర్ హెచ్చరించారు.
డీజేఎస్ నూతన రాష్ట్ర కార్యవర్గం
సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గం
అధ్యక్షులు: బాదిని ఉపేందర్
ప్రధాన కార్యదర్శి: రాజారాం
రాష్ట్ర ఉపాధ్యక్షులు: సోమనర్సయ్య (వరంగల్)
ట్రెజరర్: వెంకటరమణ
జాయింట్ సెక్రటరీలు: కనపర్తి రమేశ్, కాంకూరి వెంకటేశ్వర్ (ఖమ్మం), భీంరావు (నిజామాబాద్)
కమిటీ సభ్యులు: గరీమ, పద్మ, సత్యప్రసాద్
కీలక తీర్మానాలు..
జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని, ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను కలవాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో నరేందర్, సదానందం, లింబాద్రి, అశోక్, రమేశ్ కుమార్, సత్యం తదితరులతో పాటు పలు జిల్లాలకు చెందిన డెస్క్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.