
కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్ లో మరో టీకా పంపిణీకి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ కు ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు అభించిన విషయం తెలిసిందే. మోడెర్నా టీకా డోసులు ఈ వారంలోనే భారత్ కు చేరనున్నాయి. జూలై 15 నుంచి పలు ప్రభుత్వ ఆసుపత్రుత్లో ఈ టీకా అందుబాటులో ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.