
చిన్న పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అలాంటి ఆదేశాలు ఇచ్చెందుకు నిరాకరించింది. పిటిషన్ పై స్పందన తెలియజేయాలని కేంద్రం, డీజీసీఐని కోర్టు ఆదేశించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై ట్రయల్స్ నిర్వహించడం ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు బుధవారం తమ అభిప్రాయాలను జూలై 15 లోగా సమర్పించాలని కోరతూ కేంద్ర ప్రభుత్వం, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు నోటీసు జారీ చేసింది. అయితే ట్రయల్స్ నిర్వహణను ఆపేందుకు కోర్టు నిరాకరించింది.