కాగా ఆయన హెల్త్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని డీఎండీకే ఓ ప్రకటనలో పేర్కొంటూ ఒక లెటర్ ను రిలీజ్ చేసింది. కాగా విజయ్ కాంత్ గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
కానీ గత రెండు నెలలుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.. కానీ అంతలోనే ఏమైందో ఏమో ఉన్నట్టు ఉండి ఆయన ఇలా మళ్ళీ అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం గెట్ వెల్ సూన్ విజయ్ కాంత్ అనే హ్యాష్‌ట్యాగ్ ను వైరల్ చేసున్నారు.
ఇక విజయ్ కాంత్ లక్షలాది అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం చేస్తోన్న పూజలు ఫలించి, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, కోట్లాది గొంతుకుల ప్రశ్నగా నిలిచిన ఆయన, పూర్తిగా కోలుకుని మళ్ళీ తమిళ రాజకీయాలను ప్రభావితం చేయాలని ఆశిద్దాం.