కోవిడ్ నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 10 రాష్ట్రాల జిల్లా న్యాయాధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తమతో మాట్లాడలేదని దీనిని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు మమత. ప్రధాని ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు. కానీ మాతో మాట్లాడలేదు. మాకు మాట్లాడే అవకావం ఇవ్వలేదు. కేవలం కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని చిన్న చిన్న ప్రసంగాలు చేశారు. సమావేశం ముగిసింది. ఇది చాలా సాధారణ సమావేశంగా అనిపించింది అని అన్నారు.