
ధన్వంతరి కోవిడ్ ఆస్పత్రి శనివారం నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్ర హొంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఇందులో 950 పడకలు, 250 ఐసీయూ పడకలతో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లోనే ఎక్కవ ఐసీయూ పడకలున్నాయని తెలిపారు. కేంద్ర హొం మంత్రి అమిత్ షా శుక్రవారం అహ్మదాబాద్ లోని ధన్వంతరి కోవిడ్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు.