https://oktelugu.com/

మ‌హేశ్ బాబుకి పుత్రోత్సాహం.. గౌతమ్ గ్రేట్ !

సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుకి పుత్రోత్సాహం కలిగించాడు ఆయన కుమారుడు గౌతమ్ కృష్ణ. ఈ విషయాన్ని మహేష్ సతీమణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ తన కుమారుడు గౌత‌మ్ స్విమ్మింగ్‌ లో నెల‌కొల్పిన రికార్డు గరించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. మొత్తానికి మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు. ఇంతకీ గౌతమ్ సాధించిన ఘనత ఏమిటంటే.. ? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈత‌గాళ్ల జాబితాలో గౌతమ్ స్థానం సంపాదించాడు. 2018లో ఫ్రొఫెష‌న‌ల్ స్విమ్మర్‌గా మారాడు […]

Written By: , Updated On : June 17, 2021 / 06:15 PM IST
Follow us on

సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుకి పుత్రోత్సాహం కలిగించాడు ఆయన కుమారుడు గౌతమ్ కృష్ణ. ఈ విషయాన్ని మహేష్ సతీమణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ తన కుమారుడు గౌత‌మ్ స్విమ్మింగ్‌ లో నెల‌కొల్పిన రికార్డు గరించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. మొత్తానికి మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు. ఇంతకీ గౌతమ్ సాధించిన ఘనత ఏమిటంటే.. ?

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈత‌గాళ్ల జాబితాలో గౌతమ్ స్థానం సంపాదించాడు. 2018లో ఫ్రొఫెష‌న‌ల్ స్విమ్మర్‌గా మారాడు గౌత‌మ్. కేవలం 15 ఏళ్ల వ‌య‌సులోనే తన కుమారుడు ఈ రికార్డ్ ను సాధించినందుకు మహేష్ బాబు చాల సంతోషంగా ఉన్నాడట. గౌత‌మ్‌ స్విమ్మింగ్ గురించి నమ్రత చెబుతూ.. ‘గౌతమ్ 3 గంట‌ల్లో 5 కి.మీ. దూరాన్ని ఈద‌గ‌ల‌డు.

బ‌ట‌ర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్ అనే నాలుగు ప‌ద్ధ‌తుల్లో చాల వేగంగా గౌతమ్ ఈత కొడ‌తాడు అంటూ న‌మ్ర‌తా మురిసిపోతూ చెప్పుకొచ్చింది. ఇక మ‌హేశ్ బాబు హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన ‘1 నేనొక్క‌డినే’ చిత్రంతో గౌత‌మ్ వెండి తెర‌కు కూడా ప‌రిచ‌యమైన సంగతి తెలిసిందే. నటుడిగా కూడా గౌతమ్ మంచి మార్కులు కొట్టేశాడు.

ఆ తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తాడని వార్తలు వచ్చినా.. గౌతమ్ మాత్రం నటనకు దూరంగా ఉన్నాడు. అయితే, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా రానున్న సినిమాలో గౌత‌మ్‌ ఓ పాత్రలో కనిపిస్తాడట. మరీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.