
తెలంగాణలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తెలిపారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటించాయని ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు.