యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంగ్లీష్ సినిమాల్లో నుండి షాట్లును కాపీ కొట్టి, మొత్తానికి కొత్తదనం అంటూ ఇండస్ట్రీలో మంచి పేరే తెచ్చుకున్నాడు. దాంతో ప్రేక్షకులు కూడా మిగిలిన దర్శకుల సినిమాలతో పోలిస్తే, ఈ యంగ్ డైరెక్టర్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని ఒక స్టాంప్ వేసుకుని ఆ రకంగా అతన్ని ట్రీట్ చేస్తూ ఫాలో అవుతూ ఉన్నారు.
అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పిన సంగతులు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అతని ఏమి చెప్పాడంటే.. దర్శకుడిగా సినిమాలు చేయాలని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని.. రికమెండేషన్ తో ఓ డైరెక్టర్ దగ్గర పని చేయడానికి వెళ్తే..తనకు చాల ఘోరమైన అవమానం జరిగిందని చెప్పుకుకొచ్చాడు.
ఆ పెద్ద దర్శకుడు తనను చాలా సేపు తనను వెయిట్ చేయించి, చివరకు తనతో వాటర్ తెప్పించుకోవడం, టిఫిన్ తెప్పించుకోవడం వంటి పనులు చేయించుకున్నాడట. ఆ సమయంలో చాల బాధ పడ్డానని, ఇప్పటికీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లను చాల హీనంగా చూస్తారని, అలాగే టైమ్ కి జీతాలు కూడా ఇవ్వరనే విషయం నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదని ఇలా చాలానే చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
పనిలో పనిగా ఓ సీనియర్ హీరోకి కథ చెప్పడానికి అతని ఇంటికి వెళ్ళాడట ఈ కుర్ర డైరెక్టర్. అయితే, ఆ హీరోగారు మత్తులో ఉన్నారో లేక ఎక్కడ ఆయనగారి ఇగో హర్ట్ అయిందో తెలియదు గానీ, ప్రశాంత్ ను గేటు దగ్గరే వెయిట్ చేయించారు. ఆ సమయంలో వర్షం పడినా ఆ హీరో కావాలని లేట్ చేశాడని, అప్పుడు కోపం వచ్చినా.. కంట్రోల్ చేసుకొని ఆ హీరోకి కథ చెప్పి.. ఆయనతో సినిమా కూడా చేశానని చెప్పాడు. మరి ఆ హీరో రాజశేఖర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.