India-Pakistan Relations : భారత్ అంటే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది పాకిస్తాన్. మన దేశ ప్రగతిని.. సాధిస్తున్న ఎదుగుదలను ఏమాత్రం ఓర్వలేదు. మనతో నిత్యం కవ్వింపులకు పాల్పడుతూనే ఉంటుంది. సరిహద్దుల్లో రక్తపుటేరులు పారిస్తూనే ఉంటుంది. అభివృద్ధిలో.. అక్షరాస్యతలో.. మిగతా విషయాలలో మన దేశంతో పోల్చి చూస్తే ఎక్కడో ఉండే పాకిస్తాన్.. ఉగ్రవాదం విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉంటుంది. పైగా ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ పాకిస్తాన్ ప్రజల టాక్స్ లను సైతం ఉగ్రవాదుల పోషణ కోసం వెచ్చిస్తూ ఉంటుంది.
మన దేశంలో గతంలో జరిగిన.. ప్రస్తుతం చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల వెనక కచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంటుంది. మన దేశాన్ని నాశనం చేయడానికి.. అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ ఇతర శక్తులతో ఖచ్చితంగా చేయి కలుపుతుంది. తను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ.. భారత్ పెరుగుతుంటే మాత్రం తట్టుకోలేదు.. పైగా అత్యంత క్రూరమైన విధానాలకు పాల్పడుతూ ఉంటుంది.. పాకిస్తాన్ మనతో విడిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక ఉగ్రవాదం మినహా మిగతా ఏ విషయంలోనూ అంతగా అభివృద్ధి సాధించలేదు.. ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టించుకోని అక్కడి పరిపాలకులు.. ఉగ్రవాద కార్యకలాపాలలో మాత్రం ఉత్సాహంగా ఉంటారు.. తాము సంపాదించుకోవడానికి.. భారీగా వెనకేసుకోవడానికి ఏమాత్రం వెనకాడని పాకిస్తాన్ పరిపాలకులు.. ప్రజల బాగోగులను మాత్రం కనీసం పట్టించుకోరు.. భారత్ అంటే చాలు అగ్గిమీద గుగ్గిలం లాగా రెచ్చిపోతారు.. ఒకవేళ భారత్ గనుక దాడి చేస్తే విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు.
తాజాగా ఢిల్లీలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పేలుడుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ కారణమని ఇప్పటికే భారత ఇంటలిజెన్స్ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. దీనికి సంబంధించి అత్యంత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే బయటికి తీసుకొచ్చి కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇది ఇలా సాగుతుండగానే పాకిస్తాన్ మరో విధంగా మాట్లాడింది. ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుడుకు సంబంధించి పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ నెత్తి మాసిన వ్యాఖ్యలు చేశారు. ” నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు. ఇప్పుడేమో విదేశాల కుట్ర దాగి ఉందని భారత్ ఆరోపిస్తోందని” ఆయన పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఈ ఘటనను వాడుకుంటున్నదని ఓ టీవీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. త్వరలో పాకిస్తాన్ పై భారత్ ఆరోపణలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు తమ వరకు భారత్ వస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
అసిఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల భారతీయులు మండిపడుతున్నారు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాక్ పాలకులకు అలవాటేనని.. ఆపరేషన్ సిందూర్ మొదలైనప్పుడు పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిందని.. ఆ తర్వాత ఎలా మాట్లాడిందో అందరికి తెలుసని నెటిజన్లు పేర్కొంటున్నారు.