Bigg Boss 9 Telugu: ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తనూజ మరియు పవన్ కళ్యాణ్ మాత్రమే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారు అనేది ఫిక్స్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ లో తనూజ, పవన్ కళ్యాణ్ మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. ఇద్దరు టాప్ 2 స్థానాల్లోనే ఉన్నారు కానీ, ఓటింగ్ మాత్రం తనూజ లో కళ్యాణ్ కి సగం కూడా లేదు. అయితే ఈ వారం తనూజ కి వరుసగా నెగిటివ్ ఎపిసోడ్స్ పడడం, అదే సమయం లో పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ ఎపిసోడ్స్ పడడం వల్ల, తనూజ గ్రాఫ్ కాస్త తగ్గింది. ఆమె యాటిట్యూడ్ ఇలాగే ఇంకో వారం కొనసాగితే రెండవ స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. రోజురోజుకి కంటెస్టెంట్స్ గ్రాఫ్ లో ఈ రేంజ్ తేడా కనిపిస్తోంది.
అయితే నిన్నటి ఎపిసోడ్ లో తనూజ చాలా పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకుంది అనే చెప్పాలి. సరదా టాస్క్ కాస్త సీరియస్ అయిపోయింది. వివరాల్లోకి వెళ్తే మహారాణి క్యారక్టర్ లో ఉన్న దివ్య, తన కమాండర్లు నిఖిల్ మరియు పవన్ లకు తనూజ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అని అంటుంది. అప్పుడు వాళ్లిద్దరూ తనూజ ని పట్టుకోవడానికి వస్తారు. ఏంటి మీరు మగవాళ్ళని డీల్ చేసినట్టు నన్ను డీల్ చేస్తున్నారు? అని అడుగుతుంది. రాణి గా నేను ఇచ్చిన ఆదేశాలను కమాండర్స్ గా వాళ్ళు పాటిస్తున్నారు అంతే, మగ, ఆడ అనే తేడా లేదంటూ దివ్య అంటుంది. ఇక తర్వాత తనూజ మరియు డిమోన్ పవన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. ‘ఇందాక నువ్వు అలా ఫోర్స్ గా నా భుజాలను నెట్టడం నచ్చలేదు..మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా అనిపించింది’ అని అంటుంది.
ఇక్కడ డిమోన్ పవన్ బాగా హర్ట్ అవుతాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి?, సరదా టాస్కులను కూడా తీసుకోకపోతే ఎలా?, ఏది పడితే అది మాట్లాడితే పడేందుకు ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు, ఇంకోసారి నిన్ను ముట్టుకుంటే అప్పుడు అడుగు అంటూ డిమోన్ చాలా సీరియస్ అవుతాడు. ఎప్పుడూ ఎంతో కూల్ గా మాట్లాడే డిమోన్ పవన్ లో ఇంత ఆవేశం రావడానికి కారణం తనూజ అతని క్యారక్టర్ ని దెబ్బతీసే విధంగా మాట్లాడడమే. ఈ విషయం ముమ్మాటికీ తప్పే. సోషల్ మీడియా లోని పాపులర్ బిగ్ బాస్ రివ్యూయర్స్ ఈ విషయం లో తనూజ ని ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ఇది ఆమె గ్రాఫ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో తనూజ గ్రాఫ్ ఇలాగే తగ్గుతూ పోతుందా?, లేదా ఈ నెగిటివిటీ ని దాటుకొని టైటిల్ గెలిచి ప్రభంజనం సృష్టించబోతోందా అనేది.