Donald Trump Syria President : డోనాల్డ్ ట్రంప్.. అమెరికాకు అధ్యక్షుడు. అమెరికా అంటే ప్రపంచ దేశాలకు పెద్దన్న. దశాబ్దల కాలంగా ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగిస్తోంది. ఇలాంటి అమెరికాకు అధ్యక్షుడు అంటే మాటలు కాదు. ఒక రకంగా ప్రపంచాన్ని మొత్తం శాసించే స్థాయి ట్రంప్ కు ఉంటుంది. ట్రంప్ తీసుకొనే ప్రతి నిర్ణయం.. ట్రంప్ మాట్లాడే ప్రతి మాట ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. పైగా రెండో సారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. టారీఫ్ లు, ఇతర ఆంక్షలు ప్రపంచ దేశాలకు నరకం చూపిస్తున్నాయి.
ట్రంప్ తీసుకొని నిర్ణయాలు మాత్రమే కాదు ఆయన మాట్లాడే మాటలు కూడా వివాదాస్పదమవుతున్నాయి.. తాజాగా సిరియా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించారు. దాదాపు 1946 లో సిరియాకు స్వాతంత్రం వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అమెరికాలో పర్యటించిన తొలి అధ్యక్షుడు ప్రస్తుత ఆల్ షరా మాత్రమే కావడం విశేషం. సిరియాలో ప్రస్తుతం పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవు. ఇటీవల కాలంలో సిరియాకు అమెరికా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో సిరియా అధ్యక్షుడు ఆల్ షరా ట్రంప్ ను కలిశాడు.. వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. ఇద్దరు లంచ్ కూడా చేశారు. ఆ తర్వాత అధికారికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో షరా పై ట్రంప్ ఒక పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారు.. ఆ తర్వాత అది ఆయనకు ఇచ్చారు..” ఈ పెర్ఫ్యూమ్ అద్భుతమైన వాసన వస్తుంది. మీరు తీసుకోండి. ఇంకొకటి కూడా మీకు ఇస్తున్నాను. ఇది మీ భార్యకు. అన్నట్టు మీకు ఎంతమంది భార్యలు” అని ట్రంప్ అనేసాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.
వాస్తవానికి బహు భార్యత్వం అనేది ఇస్లామిక్, వెస్ట్రన్ దేశాలలో ఉంటుంది. ట్రంప్ కు కూడా చాలామంది భార్యలు ఉన్నారు.. బహుశా అందువల్లే ఆయన అలా అని ఉంటాడని అమెరికా మీడియా చెబుతోంది. మరోవైపు ఇతర దేశాల మీడియా మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తోంది.. వాస్తవానికి కించపరిచే విధంగా మాట్లాడటం లో ట్రంప్ సిద్ధహస్తుడు.. సిరియాతో వ్యాపార లావాదేవీలు.. ఇతర వ్యవహారాలను సాగించే ఉద్దేశంతో ఉన్న ట్రంప్.. స్నేహ హస్తం చాచుతున్నాడు. అందువల్లే సిరియా అధ్యక్షుడితో భేటీ అయ్యాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ తో కూడా ట్రంప్ ఇలానే భేటీ అయ్యాడు. అక్కడ ఖనిజాలను తవ్వే కాంట్రాక్టు తన దేశ సంస్థలకు అప్పగించాడు. ఇప్పుడు సిరియా అధ్యక్షుడితో కూడా భేటీ అయిన ట్రంప్.. ఎలాంటి వ్యాపార లావాదేవీలను కుదుర్చుకున్నాడో తెలియాల్సి ఉంది.
Lmaooo. Trump gave the President of Syria a bottle of Trump cologne earlier this week when he visited the White House.
“The other one is for your wife. How many wives?”
“One.”
“With you guys, I never know.” pic.twitter.com/3mUqwCIxva
— johnny maga (@_johnnymaga) November 12, 2025