
దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా 14,01,609 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో 3,49,186 మంది బాధితులు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2427 మంది మరణించారు. కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.