ఈటలను ఇంటికి పంపడానికే?

ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టడానికి సర్వశక్తులూ టీఆర్ఎస్ ఒడ్డుతోంది. అందుకు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈటల ప్రస్థానానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అనుచరులను సైతం దూరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హుజురాబాద్ ప్రాంతంలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధిష్టానం దృష్టి సారించింది.అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో అందివచ్చిన ఏ అవకాశం విడిచిపెట్టడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా […]

Written By: Srinivas, Updated On : June 7, 2021 9:45 am
Follow us on

ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టడానికి సర్వశక్తులూ టీఆర్ఎస్ ఒడ్డుతోంది. అందుకు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈటల ప్రస్థానానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అనుచరులను సైతం దూరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హుజురాబాద్ ప్రాంతంలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధిష్టానం దృష్టి సారించింది.అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో అందివచ్చిన ఏ అవకాశం విడిచిపెట్టడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా ప్రజల నుంచి ఇంకా డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు ఇటీవల రాష్ర్టపతి ఆమోదం కూడా లభించింది.
ఇదే క్రమంలో హుజురాబాద్ ను కూడా జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ ను ఎదుర్కొనే క్రమంలోనే ఈ జిల్లా ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ సర్కారు పీవీ నర్సింహారావుకు ఎక్కువ గౌరవం ఇస్తోంది. ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. దీంతో ఆయన కుమార్తెను ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించుకుంది. పీవీ స్వగ్రామం హుజురాబాద్ లోనే ఉండడంతో దానికి పీవీ నర్సింహారావు జిల్లా అని పేరు పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనావిజయం సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా ఈటల మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఇందులోభాగంగానే గులాబీ దళం స్థానికంగా ఉంటూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.