
దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా 18,76,036 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి చేరాయి. 24 గంటల వ్యవధిలో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఏప్రిల్ 8నాటి కనిష్టానికి చేరింది. ఇప్పటి వరకు 4,01,050 మంది మహమ్మారికి బలయ్యారు.