గడువు పెంచిన జగన్: మంత్రులు ఫుల్ హ్యపీ

ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తతో కొందరి మంత్రుల్లో ఆందోళన మొదలైంది. తమ పదవి ఎక్కడ ఊడుతుందోనని భయం పట్టుకుంది. అయితే సీఎం జగన్ అలాంటివారికి గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక వారు తమ పదవి గురించి భయపడాల్సిన అవసరం లేదనే విధంగా సంకేతాలిచ్చాడట. ఇద్దరు మంత్రులు జగన్ దగ్గర పెట్టిన ప్రతిపాదనకు ఓకే చెప్పుడంతో ఇక ఆ మంత్రులు మరో ఆరు నెలల పాటు కూల్ గా ఉండొచ్చని అనుకుంటున్నారు. 2019 మే 30న అధికారంలోకి […]

Written By: NARESH, Updated On : July 3, 2021 9:44 am
Follow us on

ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తతో కొందరి మంత్రుల్లో ఆందోళన మొదలైంది. తమ పదవి ఎక్కడ ఊడుతుందోనని భయం పట్టుకుంది. అయితే సీఎం జగన్ అలాంటివారికి గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక వారు తమ పదవి గురించి భయపడాల్సిన అవసరం లేదనే విధంగా సంకేతాలిచ్చాడట. ఇద్దరు మంత్రులు జగన్ దగ్గర పెట్టిన ప్రతిపాదనకు ఓకే చెప్పుడంతో ఇక ఆ మంత్రులు మరో ఆరు నెలల పాటు కూల్ గా ఉండొచ్చని అనుకుంటున్నారు.

2019 మే 30న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఏ మూహుర్తంలో కేబినేట్ ఏర్పాటయిందో తెలియదు గానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలమంతా కరోనాతోనే గడిచిపోయింది. దీంతో మంత్రలు తమ అధికారాలను ఎక్కువగా ఉపయోగించలేకపోయారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలను వినే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న విషయం తెరపైకి రావడంతో అప్పుడే పూర్తయిందా అన్న ఆందోళనలో కొందరు మంత్రులు ఉన్నారు.

మంత్రుల పనితీరుపై జగన్ ఎప్పటికప్పుడు ఇంటలీజెన్స్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులపై జగన్ అసంతృప్తిగానే ఉన్నాడట. అయితే ఆ విషయం వారికి కూడా అర్థమైందట. అందుకే మంత్రివర్గ విస్తరణ అనగానే తమ పదవి ఎక్కడ ఊడుతుందోనన భయపడుతున్నారట. మంత్రిపదవి చేపట్టినప్పటి నుంచి కనీసం డాపు, దర్పం అనుభవించింది లేదని, ప్రజల్లోకి తాము మంత్రులమని చెప్పుకునే అవకాశమే రాలేదని ఆందోళన చెందుతున్నారట.

ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కేబీనెట్ ఏర్పడినప్పటి నుంచి కరోనా విజృంభించడంతో విలువైన కాలమంతా గడిపోయిందని, మంత్రి వర్గ విస్తరణకు మరికొంత గడువు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారట. దీంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డాడట. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది మే 30కి మూడేళ్లు పూర్తవుతుంది. అంటే ఆ వచ్చే ఏడాది ఇక ఎన్నికల కోసం సిద్ధమవ్వాలి. ఇక మంత్రులు తమ నియోజకవర్గాల్లో పర్యటించిందెన్నడని ఆలోచించి మంత్రి వర్గ విస్తరణను వచ్చే జూన్ వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళన చెందుతున్నమంత్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారట.