
దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు తగ్గట్టే రోజురోజుకూ కొత్త కేసుల్లో క్షీణత కనిపిస్తోంది. తాజాగా 42,640 మందికి కరోనా సోకింది. సుమారు 91 రోజుల తర్వాత తొలిసారి రోజువారీ కేసులు 50 వేల దిగువకు చేరాయి. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. తాజాగా 1,,167మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల 2,99,77,861కు చేరగా .. 3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 81,839 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.89 కోట్లకు చేరాయి.