దేశంలో కరోనా కేసులు తగ్గాయి. సోమవారం దేశవ్యాప్తంగా 14,13,951 మందికి కొవిడ్ పర్ధారణ పరీక్షలు నిర్వహించగా 26,115 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు 3.27 కోట్ల మంది వైరస్ ను జయించారు. 24 గంటల వ్యవధిలో 34 వేలమంది కోలుకున్నారు.
ప్రస్తుతం 3.09 లక్షల క్రియశీల కేసులున్నాయి. నిన్న 252 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 4.45 లక్షలకు చేరింది. క్రియాశీల రేటు 0.92 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.75 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా ఒక్క కేరళలో నమోదవుతోన్న కేసులే రోజువారీ మొత్తం కేసులపై ప్రభావం చూపుతున్నాయి.
ఆ రాష్ట్రంలో నిన్న 15వేల మందకి కరోనా సోకింది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 2,583గా ఉంది. దేశంలో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 96, 46, 778 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 81,85 కోట్లను దాటింది.