పోడు భూముల సమస్య కు త్వరలోనే పరిష్కారం లభించ నుందని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు.. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ అంగోత్. బిందు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…..రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనులు ఉన్న మహబూబాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీని మంజూరు చేయడం, స్వతంత్ర భారత దేశంలో ఎవరూ చేయని విధంగా దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకంను రాష్ట్రంలో ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వైద్య,విద్యా, వ్యవసాయ శాఖల పై చర్చ కొనసాగింది.సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. సభ్యుల సలహాలు.. సూచనలను స్వీకరించారు.
పోడు భూముల సమస్యపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం మొదటి సమావేశం పూర్తయిందని, రెండో సమావేశం కూడా అసెంబ్లీ సమావేశాల లోపే జరగనుందని, ఈ సమావేశంలో ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శశాంక , ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ , రెడ్యానాయక్ , సీతక్క , ఎమ్మెల్సీ నర్సిరెడ్డి జిల్లా అధికారులు , ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.