
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా 18,73,757 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 36,401 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 3.4 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే 24 గంటల వ్యవధిలో 530 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరగా 4,33,039 మంది మరణించారు. నిన్న 39 వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.15 కోట్ల మార్కును దాటాయి.