
దేశంలో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ముందురోజు 40 వేలకు పైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం తగ్గాయి. ఈరోజు 38,628 మందికి వైరస్ పాజిటివ్ గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. 617 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా 4,27 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17 లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో 4,12,153 యాక్టివ్ కేసులు ఉన్నాయి.