
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్తకేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,742 కొత్త కేసులు నమోదు కాగా 535 మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,18,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,20,551కి చేరింది. కొత్త కేసులతో పోల్చితే.. రికవరీల సంఖ్య కూడా దాదాపు సమానంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 39,972 మంది కరోనాను జయించారు.