
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇవాళ 58,890 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1248 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 20,04,590కి పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో ఇవాళ 1,715 మంది కోలుకున్నారు. ఇవాళ 15 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 13,750 కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి.