
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంట్లలో 46,963 నమూనాలను పరీక్షించగా 909 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 19,94,606కి చేరింది. తాజాగా 13 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,660కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.