
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 72,731 నమూనాలకు పరీక్షించగా 2,100 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,05,023కి చేరింది. తాజాగా మరో 26 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 12,870కి పెరిగింది. తాజాగా 3,435 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 33,964 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.