
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ని ఆశ్రయించింది. ఈ మేకు ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు రాయలసీమ ప్రాజెక్టును సందర్శించాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అధికారులను ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.