
ఆంధ్రప్రదేశ్ లో అమలువుతున్న పగటి పూట పాక్షిక కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ విధించి కేవలం 10 రోజులే అయ్యిందని, కర్ఫ్యూ కనీసం 4 వారాలపాటు ఉంటేనే సరైనా ఫలితాలు వస్తాయని సీఎం జనగ్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిచెందకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.