
రాయల్ చాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్ కే కెప్టెన్ ఎం ఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఇరుజట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకూ ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో నూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక సీఎస్ కే మూడు విజయాలతో రెండో స్థానంలో ఉంది.