
కరోనా కట్టడిలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్టాడారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.