ప్రభాస్ ను టాలీవుడ్ లో రెబల్ స్టార్ ను చేసిన సినిమా ‘ఛత్రపతి’. ప్రభాస్ కెరీర్ లోనే మైల్ స్టోన్ లాంటి సినిమా ఇది. ఈ సినిమాతోనే ప్రభాస్ స్టార్ అయ్యాడు. ఇటు యాక్షన్, అటు ఎమోషన్ లోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. పైగా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. అందుకే ఆ రోజుల్లోనే ఈ సినిమాకి తారాస్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. రాజమౌళి ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్నాడు అంటే.. దానికి పునాది కూడా ఈ సినిమానే.
పైగా మదర్ సెంటిమెంట్ తో చేసిన సూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమా ప్రభావం జక్కన్న పై ఎంతలా ఉంది అంటే.. బాహుబలిలో కూడా మదర్ సెంటిమెంట్ ను హైలైట్ చేసే విధంగా. అయితే ఈ సినిమా వచ్చి సంవత్సరాలు గడిచిపోయిన తరువాత.. ఇన్నాళ్లకు తీరిగ్గా ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి ఇప్పటికే ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
పైగా బాలీవుడ్ లో ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అందుకే ఈ ప్రాజెక్టు పట్ల బెల్లంకొండ ఫ్యామిలీ తెగ ఇంట్రస్ట్ చూపిస్తోంది. కానీ ఈ సినిమా నిర్మాత మాత్రం కాస్త ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అసలుకే కంటెంట్ పాతది. దానికితోడు భారీ యాక్షన్ సీన్స్. ఒక తెలుగు హీరో మీద యాక్షన్ సీక్వెన్స్ ను హిందీ జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు మొదలైపోయాయి.
అయితే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాలు అన్నీ హిందీ లోకి డబ్ చేసుకుని, యూ ట్యూబ్ లో మిలియన్ల హిట్ లు కొల్లగొట్టిన మాట వాస్తవం. అయితే యూట్యూబ్ వ్యూస్ ను పరిగణలోకి తీసుకుని దాదాపు ఏభై కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్మాత ఆలోచన. ఈ ఆలోచనలో పాయింట్ ఉంది. హిందీలో మంచి మార్కెట్ ఉన్న హీరోలకే సినిమా ప్లాప్ టాక్ వస్తే కలెక్షన్స్ రావడం లేదు. ఇక తెలుగు హీరోకి ఎందుకు వస్తాయి.అందుకే నిర్మాత భయపడుతున్నాడు. మరి సినిమాని ముందుకు తీసుకుపోతారు లేకో మధ్యలోనే ఆపేస్తారో చూడాలి.