Bigg Boss 5 Telugu: ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బిగ్ బాస్ ప్రోమో రానే వచ్చింది. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇష్టం అయిన రోజుల్లో ఒకటి శనివారం. మరి నాగ్ మామ ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ లో ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలంటే రాత్రి వరకు ఎదురు చూడాల్సిందే.సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్క హౌస్ మేట్స్ తమ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించారు. మంచిదమ్మా మంచిదమ్మ అనుకుంటే మంచం అంతా ఆగం చేసింది అన్నట్టు ఉంది శ్వేతావర్మా ప్రవర్తన. మరి నాగ్ మామ చాక్లెట్స్ ఇస్తాడా లేక చివాట్లు పెడతాడా అనే విషయం నైట్ జరిగే ఎపిసోడ్ లో చూడాలి.
ఉమా అత్తా “బూత్” రామాయణం: వాల్మీకి రామాయణం అందరికీ తెలిసిందే కాని ఉమా అత్తా బూతు రామాయణం బిగ్ బాస్ చూసే వాళ్ళకి మాత్రమే తెలుసు. మరి నాగ్ మామ ఉమా అత్తని ఎంత వరకు వేసుకుంటాడో చూడాలి..కెప్టెన్సీ కంటెండర్ ల టాస్క్ విషయంలో ఎవరిది తప్పో ఒప్పో నాగర్జున మాత్రం ఏ చెప్పగలగాలి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ శనివారం ఎపిసోడ్ కే ఒక కలికితురాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ కి చరణ్ వచ్చాడు. మరి TRP ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ప్రోమో చివర్లో నాగర్జున హౌస్ మేట్స్ కి నాగార్జున ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తూ “అన్నీ సెట్ చేస్తా, లెక్కలు తేలుస్తా” అంటూ ఎపిసోడ్ కి హైప్ క్రియేట్ చేశాడు.