
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో నకిలీ కోడిగుడ్లు కలకలం సృష్టించాయి. మండలం కేంద్రానికి సమీపంలోని ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి ఆటోలో కోడిగుడ్లను అమ్మకానికి తెచ్చాడు. 30 కోడి గుడ్లు రూ. 130 అని చెప్పడంతో స్థానికులు కొనుగోలు చేశారు. అవి ఎంత సేపటికీ ఉడక్క పోవడంతో మోసపోయామని గ్రహించారు. గుడ్డుపై ఉన్న పెంకు ప్లాస్టక్ పదార్థంగా ఉందని లోపలి తెల్లసొన కూడా తేడాగా ఉండటంతో అవి నకిలీ కోడుగుడ్లు అని చెబుతున్నారు.