https://oktelugu.com/

బాలుడిపై వ్యామోహం.. భర్త ప్రాణాలు ఖతం

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఏడడుగుల బంధం.. మూడు ముళ్ల సంబంధం. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుంది అంటారు. వివాహ బంధం గురించి పాశ్చాత్య దేశాలు ఓ వైపు ఆదర్శంగా భావిస్తుంటే మన వారు మాత్రం అందులోని ఆదర్శాలను పక్కన పెట్టి స్వార్థానికే పెద్దపీట వేస్తున్నారు. తమ సుఖం కోసం కట్టుకున్న వాడి ప్రాణాలు తీయడానికి సైతం వెనకడాడలేదు. నిండు నూరేళ్లు తోడుంటానని పెళ్లినాడు చేసిన బాసలు అడియాశలే […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2021 / 01:20 PM IST
    Follow us on

    మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఏడడుగుల బంధం.. మూడు ముళ్ల సంబంధం. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుంది అంటారు. వివాహ బంధం గురించి పాశ్చాత్య దేశాలు ఓ వైపు ఆదర్శంగా భావిస్తుంటే మన వారు మాత్రం అందులోని ఆదర్శాలను పక్కన పెట్టి స్వార్థానికే పెద్దపీట వేస్తున్నారు. తమ సుఖం కోసం కట్టుకున్న వాడి ప్రాణాలు తీయడానికి సైతం వెనకడాడలేదు.

    నిండు నూరేళ్లు తోడుంటానని పెళ్లినాడు చేసిన బాసలు అడియాశలే అవుతున్నాయి. చివరిదాకా కలిసి ఉంటానని చేసిన ప్రమాణాలు మధ్యలోనే మటుమాయం అవుతున్నాయి. వివాహ బంధం స్వార్థాలకు శిథిలమైపోతున్నాయి. ఇందుకు పలు సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాజాగా కొత్త గూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారంలో చోటుచేసుకుంది.

    ఇటీవల బూక్యా మంగీలాల్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రియుడు మోజులో పడి భార్యే కట్టుకున్న భర్తను హతమార్చింది. వివరాల్లోకి వెళితే చిట్టి రామవరం తండాకు చెందిన మాధవికి అదే ప్రాంతానికి చెందిన మంగీలాల్ అనే వ్యక్తికి వివాహం జరిగింది.

    అయితే మాధవికి అదే ప్రాంతానికి చెందిన బాలుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఆమె ఎప్పుడు తల్లిగారింటికి వచ్చేది. తన సోదరి చిట్లమ్మ ఇంట్లో ఇద్దరు శారీరకంగా కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో చాటుమాటు వ్యవహారాలకు చెక్ పెట్టాలని భావించారు. మంగీలాల్ హత్యకు పథకం రచించారు. అతడిని అడవిలోకి తీసుకెళ్లి బాగా మద్యం తాగించి చివరికి ప్రాణాలు తీశారు.

    మాధవి, ప్రియుడు, అతడి సోదరి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. కొన్నాళ్లకు పోలీసులకు శవం లభ్యమైంది. దీంతో వారు తమదైన పద్ధతిలో విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగుచూశాయి. ప్రియుడు కోసం కట్టుకున్న వాడినే కడతేర్చిన భార్య ఉదంతంపై పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ప్రియుడు బాలుడు కావడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.