
పదుల సంఖ్యలో యమునా నదిలో తేలుతున్న శవాలను చూసి యూపీలోని హమీర్ పూర్ లోని ప్రజలు వణుకుతున్నారు. వీళ్లంతా కరోనాతో చనిపోయిన వాళ్లేమో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. హమీర్ పూర్ లో కరోనాతో చనిపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారంటే వాళ్లను దహనం చేయడానికి చోటు దొరక్క ఇలా నదిలో పడేశారేమోనని కొందరు చెబుతున్నారు. యూపీలోని ఈ ప్రాంతంలో కరోనాతో ఎంత మంది చనిపోయారన్న విషయం పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఇక్కడి ఓ గ్రామంలో చనిపోయన వాళ్లకు యమునా నది తీరంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.