
కరోనా స్వల్ప లక్షణాలున్న వారికి కొవిడ్ కేర్ సెంటర్ల లో చికిత్స అందించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సెంటర్ల లో చికిత్స పొందేందుకు కరోనా పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి కాదు అని చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రల్లో ఏర్పాటు కొవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్న వారికి మాత్రమే బెడ్లు కేటాయించాలని సూచించింది. దని వల్ల బెడ్ల కొరత లేకుండా ఉంటుందని తెలిపింది. రోగులకు వైద్యం అందించేందకు నిరాకరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.