
తెలంగాణలో కరో్నా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కరోనా పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉంది అని పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ లో సీఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్ తో పాటు నిత్యావసరాల కొరత లేదు. ప్రస్తుతం 62 వేల ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.